హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు చిత్ర దర్శక నిర్మాత కెబి తిలక్ కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

KB Tilak
హైదరాబాద్: ప్రముఖ తెలుగు చిత్ర దర్సక నిర్మాత కెబి తిలక్ కన్నుమూశారు. ఆయన అనార్యోగ్యం కారణంగా హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన 1926 జనవరి 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ఆయన 1956లో ముద్దు బిడ్డకు దర్శకత్వం వహించడం ద్వారా తెలుగు సినీ రంగప్రవేశం చేశారు. ఆయనకు అభ్యుదయ దర్శకుడిగా పేరుంది. ఆయన ఇప్పటి వరకు 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ధర్మవడ్డీ.

ఆయన ఎల్వీ ప్రసాద్ కు సమీప బంధువు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన జైలుకు వెళ్లారు. రాజమండ్రి జైలులో ఆయనను పెట్టారు. కొల్లేటి కాపురం, ఎమ్మెల్యే, ఈడు-జోడు, పంతాలు - పట్టింపులు, ఉయ్యాల - జంపాల వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ నటి, ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు జయప్రదను వెండితెరకు పరిచయం చేసింది తిలకే. ఆయన భార్య ఇప్పటికే మరణించారు. కుమారుడు అమెరికాలో ఉంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X