విజయ్ అనూహ్య నిర్ణయం..! గవర్నర్ తిరస్కారం వేళ..!

తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించి అతిపెద్ద పార్టీగా ఆవిర్బవించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ (Governor) అర్లేకర్ తిరస్కరించిన వేళ.. విజయ్ (Vijay) వ్యూహం మారుస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు సైతం అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నా.. గవర్నర్ మెజార్టీ పేరుతో తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడంతో విజయ్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!
Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!

తమిళనాడులో అధికారం చేపట్టాలంటే అవసరమైన 118 సీట్ల మెజార్టీ చూపిస్తే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వనంటూ గవర్నర్ అర్లేకర్ చేస్తున్న వాదనపై విజయ్ పార్టీ టీవీకే సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద పార్టీ లేదా కూటమికి ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరడం తప్ప మరే ప్రత్యామ్నాయం లేదని వారు చెప్తున్నారు. మరోవైపు గవర్నర్ తో ఇవాళ మరోసారి భేటీ కావాలని విజయ్ నిర్ణయించారు. కాసేపట్లో గవర్నర్ ను కలిసి ఇవే విషయాల్ని చెప్పాలని విజయ్ భావిస్తున్నారు.

Vijay Makes Another Move Governor Meeting Scheduled to Assert Majority
Vijay: విజయ్ కు బిగ్ షాక్ ? సంతృప్తి చెందని గవర్నర్-ప్రమాణం వాయిదా ?
Vijay: విజయ్ కు బిగ్ షాక్ ? సంతృప్తి చెందని గవర్నర్-ప్రమాణం వాయిదా ?

తమిళనాడు ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అయిందన్న కారణం చూపి రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ సిద్దమవుతోందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకేలో కొందరు ఎమ్మెల్యేలను విజయ్ వద్దకు పంపి ప్రభుత్వ ఏర్పాటు చేయించాలని భావించిన బీజేపీ.. అది సాగకపోవడంతో ఇలా గవర్నర్ ద్వారా ఆయన్ను అడ్డుకుని, చివరకు మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్రపతి పాలనకు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయ్ గవర్నర్ ను మళ్లీ కలిసి చివరి సారిగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. ఆయన మరోసారి ఒప్పుకోకపోతే కోర్టును ఆశ్రయించి అయినా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+