డబ్బులు గుంజేందుకే సిఇవోలతో కెసిఆర్ సమావేశం: టిజి వెంకటేష్

తెలంగాణ నాయకులు అతిగా ప్రవర్తిస్తున్నారని, టిటిడికి కూడా తెలంగాణ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులు అతిగా ప్రవర్తిస్తే సివిల్ వార్ తప్పదని ఆయన అన్నారు. లా సెక్రటరీగా తెలంగాణ అధికారిని నియమించాలనే తెలంగాణ నాయకులను డిమాండ్ ను ఆయన తప్పు పట్టారు. లా సెక్రటరీ పదవి రాయలసీమకు చెందిన ఐఎఎస్ అధికారికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది రాయలసీమనే అని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులు దుర్మార్గపు ఆలోచనలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications