వైయస్ బావమరిది రవీంద్రానాథ్ రెడ్డిపై ఎర్రంనాయుడు ధ్వజం

భారీ కుంభకోణాలకు పాల్పడ్డ వైయస్ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి, ఆయన్ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. వైయస్ హయాంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కుంభకోణాలకు లెక్కే లేదని, వారందరినీ జైల్లో పెట్టాల్సి వస్తే ఇప్పుడున్నని సరిపోవని, మరికొన్ని జైళ్లు నిర్మించాల్సిన ఆవసరం వస్తుందని ఎర్రంనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు అనుకోకుండా ఆ పదవి వచ్చిందని ఆయన ఎప్పుడూ దానిని ఎలా రక్షించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు తప్పితే రాష్ట్రం గురించి ఆలోచించటం లేదన్నారు. పదవి కోసం ఆయన అక్రమాలకు పాల్పడ్డ వారిని చూసీ చూడనట్లూ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.












Click it and Unblock the Notifications