అత్యుత్సాహంతోనే చిక్కుల్లో పడ్డా: బొత్స సత్యనారాయణ

వోక్స్ వ్యాగన్ వ్యవహారం తనకు గుణపాఠం నేర్పిందని ఆయన అన్నారు. ఆ అనుభవం ద్వారా తాను అప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీడియా ప్రతినిధులకు ఆయన స్వీట్లు పంచారు. కాగా, వోక్స్ వ్యాగన్ కేసులో సిబిఐ చార్జిషీట్ పై తెలుగుదేశం పార్టీ నాయకుడు కళా వెంకటరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చార్జీషీట్ లో మంత్రి బొత్స సత్యనారాయణ పేరు లేదంటే కుంభకోణం జరగనట్లేనని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సిబిఐ ద్వారా కాంగ్రెసు నాయకులకు శిక్షలు పడవని తేలిపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications