వైయస్ బావమరిది హరితపై విచారణ: 7 కమిటీలు

Ravindranath Reddy
నల్గొండ: వైయస్ బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిల హరిత ఫెర్టిలైజర్సులో భారీ అక్రమాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేసిన ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం హరిత ఫెర్టిలైజర్లపై విచారణకు 7 కమిటీలను నియమించింది. దామరచర్లలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన హరిత ఫెర్టిలైజర్స్‌పై విచారణకు ఆర్డీవో ఆ కమిటీలను వేశారు. ఈ కమిటీలు మూడు రోజుల్లో విచారణను పూర్తి చేయాలని కమిటీలకు ఆయన ఆదేశాలిచ్చారు. ఈ భూ ఆక్రమణపై మీడియాలో పలు కథనాలు రావడం, ప్రతిపక్షాలు డిమాండ్లు చేసిన నేపథ్యంలో ఆర్డీవో కమిటీలను నియమించినట్లు సమాచారం.

వైయస్ బావమరిది, జగన్ మామ ఆయిన రవీంద్రనాథ్ రెడ్డిపై గత కొద్దికాలంగా ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. కడప జిల్లాలో సైతం కార్పోరెటర్ సమావేశంలో మేయరుగా సీటులో కూర్చుంటే కడప తెలుగు దేశం కార్పోరెటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగుదేశం, సిపిఎం, భారతీయ జనతా పార్టీ దామరచర్లలో హరిత ముందు వారు భారీస్థాయిలో నిరసత తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణకు ప్రభుత్వం అనుమతించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+