కడప: భారీ ఆక్రమాలకు పాల్పడ్డ వైయస్ బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే అరెస్లు చేయాలంటూ తెలుగుదేశం, కమ్యూనిస్టు కార్యకర్తలు భారీ ఎత్తన తరలి వచ్చి కేంద్రమంత్రి సాయిప్రతాప్, కలెక్టర్ లను ఘెరావ్ చేశారు. ఎరువుల కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డ రవీంద్రనాథ్ వైయస్ బంధువు అయినందునే ప్రభుత్వం ఆయన్ను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేసి జైళ్లో పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అక్రమాల వంటి వాటిలో వారి హవానే కొనసాగుతోందని దానిని రోశయ్య ఎక్కడ తన అధిరాకానికి ఎసరు పడుతునదోనని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు నచ్చ జెప్పినప్పటికీ సాయిప్రతాప్ ను, కలెక్టర్ ను వదలక పోవడంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వారి మధ్య ఘర్షణ స్థాయికి చేరుకుంది. దీంతో పోలీసును కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. కార్యకర్తలు సైతం ఎదురుదాడికి దిగారు. దీంతో ఎస్ఐ తలకు కొద్దిగా గాయాలయ్యాయి.పోలీసులు బలవంతంగా కార్యకర్తలను వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించాలని చూశారు. కార్యకర్తలు వారిని అంతే స్థాయిలో తిప్పికొట్టారు.