విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి: లగడపాటి రాజగోపాల్

తెలంగాణ, సీమాంధ్ర పేరుతో ఉద్యమాలు చేపట్టి అరెస్టయిన విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేయాలంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ఆయన విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలంటూ లేఖ రాశారు. విద్యార్థులు రాజకీయపార్టీలు రెచ్చగొట్టడంతో సహజంగా ఉండే ఆవేశంలో ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, రాజకీయ నాయకులు కుమ్ములాటలో వారి భవిష్యత్తు బలి కాకూడదన్నారు. ప్రభత్వం త్వరలోనే కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications