వోక్స్ వ్యాగన్ లో కాంగ్రెసుకు సీబీఐ అనుకూలం: చంద్రబాబు
State
oi-Srinivas G
By Srinivas
అనంతపురం: భారీ కుంభకోణంగా పేరుగాంచిన వోక్స్ వ్యాగన్ విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికార కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగిందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయన అనంతపూర్ జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. సీబీఐ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించడం వల్లనే బొత్స సత్యనారాయణ బయటపడ్డారన్నారు. ఈ కుంభకోణంలో బొత్స హస్తం ఉందని ప్రభుత్వానికి తెలుసునని, అయినప్పటికీ బొత్సను బయటకు లాగితే తమ పార్టీలోని చాలామంది బయట పడతారని ప్రభుత్వానికి తెలుసునని, అందువల్లనే బొత్సను ఇందులోనుండి తప్పించే ప్రయత్నలు చేసిందన్నారు.విచారణ పేరుతో సిబిఐకి కేసును అప్పగించి సిబిఐను ఆబాసుపాలు చేసిందన్నారు.