పట్టుమని పదినెలలు పార్టీని నడపలేక పోయాడు: హరీష్ రావు

మహానాడులో తెలంగాణపై కనీసం తీర్మానం పెట్టని పార్టీలో ఉండి వారు ఏం సాధిస్తారన్నారు. మహానాడులో కనీసం తెలంగాణకోసం మరణించిన విద్యార్థులపై తీర్నాణం కూడా చేయలేదని విమర్శించారు. దేవేందర్ గౌడ్ ను వికారాబాద్ లో అడ్డుకొని సమావేశానికి కూడా వెళ్లనివ్వలేదని, కనీసం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం కూడా చెప్పలేక పోయాడన్నారు. ఆంధ్రులకు పలుమార్లు ఆమ్ముడు పోవటం తెలంగాణ తెలుగు దేశం నాయకులు తెలంగాణను బజారు కీడుస్తున్నారన్నారు.
చంద్రబాబు అనవసరంగా టీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగడం మానుకొని శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వాలన్నారు.చంద్రబాబు సీమాంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లు ఆంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని, తెలంగాణపై మొసని కన్నీరు కార్చుతూ సానుభుతి తెలంగాణలో క్రమంగా కోల్పోతున్న క్యాడర్ ను నిలబెట్టుకోవాలని చూస్తున్నాడన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే విమర్షలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో తెలుగు దేశానికి స్వార్థంతో ఉన్న నాయకులు తప్పితే కార్యకర్తలు మిగలరని అన్నారు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకొని చంద్రబాబును వ్యతిరేకించి బయటకు వచ్చి తెలంగాణకోసం స్వచ్ఛందంగా పోరాడుతామంటే తాము తప్పుకొని, మీ వెనుక నడవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కావాలంటే తెలంగాణ కోసం మరోసారి రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. పదవులను తృణపాయంగా పలుమార్లు వదులుకున్న తమకు తెలంగాణే ముఖ్యమనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, కాని తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం గ్రహించలేక పోయారన్నారు.












Click it and Unblock the Notifications