మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పై ఆదిపత్యపోరా...!

కాగా నిందితులు ఇంతకు ముందు మంత్రి డెవలపర్స్ పై కాల్పులు జరిపారని పోలీసులు అన్నారు. నిందితులు మూడు రౌండ్లు కాల్పులు జరిగియాని పోలీసులు అన్నారు. ఇంతకు ముందు జయనగరలో శభనం డెవపర్స్ పై రవిపూజారీ అనుచరులు కాల్పులు జరిపారు. ఆసమయంలో ఇద్దరు దుర్మరణ చెందారు. తరువాత రవిపూజారీ దౌర్జన్యాల గురించి అనేక చోట్ల ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేయాలని నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే దుబాయ్ లో తలదాచుకున్న నిందితుడు రవిపూజారీ తన అనుచురులతో కలిసి ఇలాంటి బెదిరింపులు చేస్తున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవిపూజారి నేను హిందువు మీరు సహాయం చేయండి లేందటే మీ అంతు చూస్తాను అని హెచ్చరించడం మొదలు పెట్టాడని పోలీసులు అన్నారు. నిందితులను త్వరలో అరెస్టు చుయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడిలో మంత్రి డెవలపర్స్ లో పనిచేస్తున్న సిబ్బందికి గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరపోలీసులు 20 మంది రవిపూజారి అనుచరులుగా అనుమానాస్పద వ్యక్తులని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బెంగళూర్ లోని బిల్డర్స్ ని, వ్యాపారులని మా ప్రాణాలు పోయినా కాపాడుతామని నగర పోలీస్ కమీషనర్ శంకర బిదరి బరోస ఇచ్చారు.












Click it and Unblock the Notifications