తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం కాలినడకన వెలుతూ మూడు రోజుల క్రితం లోయలో పడిపోయిన యువతి ప్రాణాలతోనే వున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గుర్తించి, చివరకు రక్షించారు. ఆ యువతి 30 ఏళ్లు వరకు ఉంటుంది. తల్లిదండ్రులతో వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చి వారితో చెప్పకుండానే తిరుమల అందాలు చూస్తూ లోయలోకి జారీపోయినట్లు ఆమె చెప్పింది. తనది చిత్తురు జిల్లా ఆని, తన తండ్రి వెంకటాద్రి అని ఆమె కొన్ని పొంతనలోని మాటలు చెబుతోంది. ఆయితే ఆమె మూడురోజులుగా లోయలో ఉండటంతో ఆమెకు సంబంధించిన ఆమెపై ఒత్తిడి పెట్టలేక ఆమె చెప్పిన విషయాలను పూర్తిగా సేకరించలేక పోతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఆయితే ఆమెను రక్షించి స్థానిక రుయా ఆసుపత్రికి తరలించారు. ఆయితే ఆమే లోయలో బారీపోవడంపై మరో కథనం కూడా వినబడుతోంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వస్తుంటే జారిపడినట్లు చెబుతున్నారు. ఆమెకు జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉన్నట్లూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఆమె మూడు రోజులుగా లోయలోనుండి బయటకు రావటానికి అసంతృప్తితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఆమె ఆత్మహత్యను కూడా కొట్టిపారేయ లేక పోతున్నారు.