చంద్రబాబు ఎన్టీఆర్ ను చంపిన రాక్షుడు: అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అధికార పిశాచి పట్టిందని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు మరోసారి ధ్వజమెత్తారు. తొమ్మదేళ్లు పాలించిన బాబు రాష్ట్రాన్ని ఆధ్వాన్నంగా తయారు చేశాడని, వైయస్ ఆధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సుభిక్షంగా మారిందన్నారు. బాబు అధికారదాహంతో ఏమైనా చేయటానికి వెనకాడరని, అందుకే 2004లో భాజపాతో, 2009లో బద్ద వ్యతిరేకి అయిన తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆయనను ప్రజలు తిరస్కరించారన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కన్నా ముందే బాబు తన పిల్లనిచ్చిన మామకే అన్యాయం చేశాడని ఆ బాధతోనే ఆ మహానుభావుడు మరణించాడని పేర్కొన్నారు. పదిహేనేళ్ల క్రితం ఎన్టీరామారావును అన్యాయంగా గద్దె దించి తాను ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడని, అలాగే 1999లో బిజెపితో పొత్తు పెట్టుకొని గెలిచాడు. కాని బాబు సొంతంగా అధికారంలోకి వచ్చింది ఎన్నడూ లేదన్నాడు. మామకె వెన్నుపోటు పొడిచి ఆయన్ను చంపిన పెద్ద రాక్షసుడు బాబు అని, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ఆయనకు లేదని అంబటి విమర్శించారు.

వైయస్ ను అలీబాబా 40 దొంగలు అనటంతోనే ఆయన ఆజ్జానం బయట పడుతోందన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్రం యావత్తు అభినందిస్తే ఆయన మాత్రం వైయస్ ను అవినీతిపరుడని వ్యాఖ్యానించడం ఆయన అజ్జానానికి నిదర్శనమన్నారు. బాబు హయాంలోనే అవినీతి జరిగిందనడానికి స్విస్ బ్యాంకులో ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకుల అక్రమ సంపాదన, సింగపూర్ హోటల్లలో బాబుకు ఉన్న పెట్టుబడులే నిదర్శనమన్నారు. వైయస్ ను జగన్ లో చూసుకుంటూ జనం ఆయనకు బ్రహ్మరధం పడుతుంటే దానిని జీర్ణించుకోలేని బాబు తనకు జగన్ రాజకీయంగా అడ్డు వస్తాడనే ఉద్దేశ్యంతోనే ఆవాకులు చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+