వైయస్సార్ రైతులను దోచి దళారులకు పెట్టారు: చంద్రబాబు

ఎరువుల అక్రమ రవాణాలో కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిపై పెట్టిన 420 కేసును ఉపసంహరించుకోవడంపై చంద్రబాబు ముఖ్యమంత్రి కె. రోశయ్య మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రవీంద్రనాథ్ రెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ బావ మరిది కాబట్టి రవీంద్రనాథ్ రెడ్డిపై కేసును ఉపసంహరించారా అని ఆయన అడిగారు. వైయస్సార్ పేరు వింటేనే రోశయ్య భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారని, ఘనంగా పిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారని రఘువీరా రెడ్డి అంటున్నారని, మంగళసూత్రాలు కూడా అమ్ముకుని పెళ్లిళ్లు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు బంగారు పల్లెంలో తినడం లేదని ఆయన అన్నారు. లేపాక్షి నాలెడ్జి సిటీ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications