అన్నయ్య చిరంజీవి కోసం మళ్లీ తమ్ముడు నాగబాబు

Nagababu
హైదరాబాద్: అన్నయ్య చిరంజీవి కోసం పెద్ద తమ్ముడు నాగేంద్రబాబు మరోసారి నడుం బిగించాడు. ప్రజారాజ్యం పూర్తిగా నిర్వీర్యం అవుతుండటంతో ఇన్నాళ్లూ తెరవెనుకనున్న నాగబాబు మళ్లీ తెరముందుకు రావడానికి సిద్ధమయినట్టు ఉన్నాడు. ఆదివారం గుంటూరు జిల్లాలో చిరంజీవి ఆభిమానులతో సమావేశం నిర్వహించడమే ఆయన మళ్లీ అన్నయ్యకు అండగా తెరపైకి వస్తున్నాడనడానికి నిదర్శనం. పార్టీనుంచి దొంగలంతా వెళ్లిపోయారని, ఇకనుండి అభిమానులకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని వారితో చెప్పాడు. రెండున్నర దశాబ్దాలుగా చిరంజీవి అభిమాలుగా పోస్టర్లు అంటించి, కటౌట్ లు కట్టి, స్వీట్లు పంచి, వంద రోజుల ఫంక్షన్ ను పెద్ద ఎత్తున నిర్వహించిన అభిమానులకు చిరంజీవి గత ఎన్నికల్లో మొండిచేయి చూపించారు. వివిధ పార్టీల నుండి వచ్చిన సీనియర్ నేతలకు ఆయన అవకాశమిచ్చారు. దాంతో సినిమా పరంగా చిరంజీవి అంటే అభిమానం ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయనంటే వారికి వ్యతిరేకత ఏర్పడింది. దాంతో అభిమానులు కొందరు పార్టీకి దూరమయినవారు కూడా ఉన్నారు.

ఎన్నో అంచనాలతో పార్టీ పెట్టిన చిరంజీని గత ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. నాటి ఎన్టీఆర్ ప్రజలు బ్రహ్మరధం పట్టినట్లు చిరంజీవికి పట్టారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ లా చిరంజీవి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తారను అంచనాలు వేశారు. ఈ దఫా చిరంజీవే ముఖ్యమంత్రి అని చాలామంది అనుకున్నారు. ఆయన అభిమానులైతే పండుగ చేసుకున్నారు. అయన వ్యతిరేకులు సైతం ఆయన గెలుస్తాడని ఒప్పుకోవడానికి ఇష్టపడక ఏ పార్టీకి ఆధిక్యం రాదు. హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. కాని తీరా ఫలితాలు వెలువడినాక తెలిసింది చిరంజీవికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నప్పటీకి రాజకీయంగా అయనను ఎవరూ ఆమోదించలేక పోయారని, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ చిరంజీవి 17 సీట్లు మాత్రమే గెలుచుకొని ఘోర ఆవమానం పాలయ్యాడు. ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓటమికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చూపించారు. అల్లు అరవింద్ అక్రమాలు, పార్టీని నడపలేని చిరంజీవి ఆసమర్థత, అభిమాలకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు ఆమ్ముకోవటం వంటి పలు కారణాలు ఉన్నప్పటికీ ఆ పరాజయంలో పాత్రలేని, 17 సీట్లలో సాధించిన విజయంలో కూడా చిరంజీవికన్నా నాగబాబు పాత్రే ఎక్కువ ఉందనటంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.

ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయన చిరంజీవి తరఫున గ్రామగ్రామాన తిరిగారు. అభిమానులను కలుసుకున్నారు. సమావేశాలు నిర్వహించారు. చర్చలు జరిపారు. పార్టీ బలోపేతానికి ఒక ఉద్యమాన్ని చేశారనే చెప్పవచ్చు. చిరంజీవికి ఉన్న క్రేజీతో పాటు నాగబాబు నిరంతర పర్యటన మిగిలి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. ఆభిమానులను ఉత్సాహపరిచాయి. చిరంజీవి మళ్లీ నాటి ఎన్టీఆర్ లా అవుతాడని అందరూ ఊహించారు. దానికంతటికీ కారణం చిరంజీవికి ఉన్న అభిమానం ఒక్కటే కాదని, నిరంతర శ్రమతో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను కలిసిన నాగబాబుది కాదని మాత్రం చెప్పలేం.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కన్నా నాగబాబే రాజకీయంగా ఆకట్టుకుంటున్నాడని అందరికీ ఆనాడే తెలిసింది.అయితే గత ఎన్నికలలో ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత నాగబాబు బయటికి ఎక్కువగా రాలేక పోయినవడానికి కారణాలు ఏమైనా ప్రజారాజ్యాన్ని మళ్లి పునరుద్దరించాలంటే నాగబాబుకే సాధ్యం అని చిరంజీవి గమనించినట్టున్నారు. అందుకే మళ్లీ ఆయన చిరంజీవి ఆభిమానులను కలుసుకుంటున్నారు.

ఎన్నికల్లోనే భారీ ఓటమి భారంతో ఉన్న పార్టీకీ ఆ తర్వాత కష్టాలు తప్పలేదు. పార్టీలోకి వచ్చిన దేవేందర్ గౌడ్ వంటి నాయకులు ఓడిపోయి మళ్లీ మాతృపార్టీలోకే వచ్చారు. టిక్కెట్ ఇచ్చినప్పటికి చాలామంది నాయకులు చిరంజీవికి దూరమయ్యారు. చిరంజీవితో లాభపడుదామనుకున్నా వారికి దిమ్మ తిరిగే జవాబు ప్రజలనుండి వచ్చింది దీంతో వారు బయటకు వెళ్లిపోయారు. తెలంగాణలోనైతే ప్రజారాజ్యం కార్యకర్తలు, నాయకులను భూతద్దం పెట్టుకొని వెదికినా కనిపించరు. మొన్నటి ఉప ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేయక పోవటానికి కారణం అదే. కేవలం ఆయన అభిమానులు మాత్రం అప్పుడప్పుడు హడావుడి చేస్తుంటారు. కాని వారి కుటుంబ చిత్రాలకు అదే తెలంగాణలో మంచి ఆదరణ ఇప్పటికీ ఉంటుంది. అంటే తెలంగాణలోని ఆయన అభిమానులు సైతం రాజకీయాన్ని, సినిమాను వేరుగా చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

ఇక సీమాంధ్రలో అటు జగన్, ఇటు జగన్ వ్యతిరేకులు నిరంతరం పత్రికలకెక్కుతూ కాంగ్రెస్ ను బతికిస్తున్నారు. చంద్రబాబు తన పర్యటనలతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నాడు. ప్రతిపక్షంగా ప్రభుత్వంపై నిరంతరం పత్రికల్లో నిలుస్తూ పార్టీని నిలబెట్టుకుంటున్నాడు. ఇక చిరంజీవి అటు ప్రభుత్వాన్ని విమర్శించలేక, ఇటు అధికారంలో లేక, సమస్యలపై ప్రభుత్వాన్ని సరిగా విమర్శించలేక సీమాంధ్రలోనూ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ఆలస్యంగా మేలుకున్న చిరంజీవి నాగబాబును మళ్లీ రంగంలోకి దించాడని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగానే నాగబాబు పర్యటనలకు శ్రీకారం చుట్టవచ్చని భానిస్తున్నారు. ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా మెల్లిమెల్లిగా నాగబాబు తన పని తాను చేసుకుంటూ పోయి చిరంజీవికి గతంలో అందని ముఖ్యమంత్రి పదవిని ఈసారి అందిస్తాడనుకుంటున్నారు. అభిమానులను ఇన్నాళ్లు చిరంజీవి విస్మరించారని ఆయన మాటల్లోనే గుంటూరులో స్పష్టం అయ్యింది. ఇప్పటికైనా అభిమానులను ఆయన పక్కన పెట్టకుండా ఉంటే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+