తెలంగాణ కోసం రంగారెడ్డి జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Rangareddy District
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ మండలంలోని మదనపల్లికి చెందిన సొప్పరి యాదయ్య అనే యువకుడు సోమవారం ఉదయం కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పూనుకున్నాడు. అయితే సగానికి పైగా ఆయన కాలిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించి వైద్యం చేస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా అనేక పార్టీలు తెలంగాణ రాకుండా చేయాలని చూస్తున్నాయని అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పూనుకున్న యాదయ్య కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు ఎ.చంద్రశేఖర్ పలకరించారు.

సంవత్సర కాలంనుండి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది. విద్యార్థులు, తెలంగాణవాదులు తెలంగాణ రావాలని రాసుకొని ఆత్మహత్యలకు పూనుకున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు, చివరకు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయితే తెరాసతో పాటు పలువురు తెలంగాణవాదులు తెలంగాణను పోరాడి సాదిద్ధాం మరణించి కాదని, ప్రాణాలర్పించి కాదు, తెలంగాణను కళ్లారా చూద్దామని చెబుతున్నప్పటికి యువతరం ఆవేశంలో నిర్ణయం తీసుకుంటుంది. మూడు రోజులు క్రితం కూడా కరీంనగర్ లో ప్రవీణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు రోజు వరంగల్ లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పూనుకున్నాడు. తీవ్రగాయాలు కావటంతో ఆయనను హాస్పిటల్ కు తరలించారు. మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+