పార్టీకి బావ మరిది అల్లు అరవింద్, సినిమాలకు బావ చిరంజీవి

చిత్ర నిర్మాణం పూర్తి కావడానికి చిరంజీవికి కనీసం ఏడాది పడుతుంది. ఈ ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలను చూసుకుంటూ చిత్రంలో నటించడం కష్టంగానే ఉంటుంది. రెండు గుర్రాలపై స్వారీ అంత సులభం కాదు. అందుకే ఆయన తన బావమరిదికి పార్టీ నాయకత్వాన్ని అప్పగించినట్లు చెప్పవచ్చు. అమెరికా పర్యటనలో ఉన్న చిరంజీవి పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి అల్లు అరవింద్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు చెప్పారు. తన గైర్హాజరీలో పార్టీని నాయకులు ఎటు వైపు తీసుకుని పోతారో అనే భయంతో అల్లు అరవింద్ కు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications