తెంలగాణపై బాబు రెండు నాల్కలకు కాంగ్రెసు కౌంటర్

తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబును ఒప్పించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం టిడిపి తెలంగాణ నాయకులను డిమాండ్ చేశారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కాంగ్రెసు సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా ఇంటి ముందు ధర్నాకు చంద్రబాబు నాయకత్వం వహించాలని ఆయన కోరారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి విడనాడి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడగలరా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతివ్వమని తెదేపా సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించడాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ తప్పుబట్టారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ తెదేపా నేతలు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విషయమై శాసనసభలో తీర్మానం చేయాలని సోనియా కోరారని, దీన్ని తెదేపా నేతలు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. అవసరాన్ని, సమయాన్ని, సెంటిమెంటును బట్టి మాట్లాడడం సరికాదని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications