రామ్ గోపాల్ వర్మపై నిప్పులు చెరుగుతున్న బెజవాడ నాయకులు

బెజవాడ రౌడీయిజంపై సినిమా తీయనున్నట్లు ప్రకటించిన రాంగోపాల్‌వర్మపై టీడీపీ నేత వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వర్మ పిచ్చోడని, అతను తీసిన సినిమాల వల్ల సమాజానికి ఎలాంటి మేలు కలగదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బెజవాడ పరువు తీస్తున్న వర్మను సామాజికంగా బహిష్కరించాలని వంశీ అన్నారు. కుటుంబ బాధ్యత తెలియని వర్మ సమాజానికి చేసేది ఏంటని ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాపై కూడా గతంలో వల్లభనేని వంశీ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications