గుంటూరు: గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన ఓ హోంగార్డు యువతిపై అత్యాచారం చేశాడు. వివరాలకు వస్తే గుంటూరు జిల్లాలోని గజ్జనగుళ్లలో ఓ హోంగార్డు అక్కడున్న ఓ యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి నుండి వివరాలు తెలుసుకున్న వారి బంధువులు పట్టాభిపురం పోలీసు స్టేషనులో కేసు వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తం చేస్తున్నారు.