అన్న కూతురితో ప్రేమ: నల్లగొండ జిల్లాలో పరువు హత్యలు
Districts
oi-Pratapreddy
By Pratap
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పరువు హత్య జరిగింది. ఓ ప్రేమ జంటను గ్రామస్తులు చంపేసి వాగులో పడేశారు. ఈ ఘటన పెద్దవూర మండలం నాయకుని తండాలో జరిగింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవులపల్లి గ్రామంలోని అర్జున్ అనే వ్యక్తి అన్న కూతురు బుజ్జిని ప్రేమించారు. బాబాయ్ కూతురును ప్రేమించడం సహించలేని గ్రామస్తులు వారిద్దరిని చంపి వాగులో పడేశారు.
అర్జున్, బుజ్జి పారిపోయి నాయకుని తండాలో తలదాచుకున్నారు. వారిద్దరిని వేటాడి పట్టుకున్న గ్రామస్తులు చంపేసి వాగులో పడేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.