తెరాస అధినేత కెసిఆర్ సోనియా గాందీ తొత్తు: నామా నాగేశ్వరరావు ఫైర్

Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన కెసిఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో కెసిఆర్ అనవసరంగా తెలుగు దేశాన్ని బలి చేయాలని చూస్తున్నారని, తప్పు చేసింది కాంగ్రెస్ అయితే ఆయన మాపై విమర్శలు గుప్పించటం ఏమిటన్నారు. కెసిఆర్ ఒక్కోసారి ఒక్కోవిధంగా మాట్లాడుతాడని ఆయన మాటలు నిలకడగా ఉండవని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని అడ్డంకి తెలుగు దేశమే అంటున్న కెసిఆర్ చిత్తశుద్ధి ఏపాటిదో ఆర్థమవుతుందన్నారు. తెలంగాణ అంశం తెలుగు దేశం దగ్గర లేదని, అది పార్లమెంటు విషయమన్నారు. ప్రభుత్వం సోనియాగాంధీ చేతిలోనే ఉన్నదని, బిల్లు ప్రవే వారు వెంటనే బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

బిల్లు పెడితే ఓటు వేయకుంటే తెలుగు దేశం తప్పు అవుతుందని, కాని మేం తెలంగాణకు అనుకూలం కాబట్టి బిల్లు ప్రవేశ పెడితే మొదటి ఓటు మేమే ఓటు వేస్తామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పకముందే ఆమె చెప్పింది అని కెసిఆర్ అనడాన్ని బట్టి చూస్తుంటే ఆమెకు తొత్తుగా వ్యవహరిస్తున్నట్టున్నాడని అన్నారు. తెలంగాణ బిల్లును కూడా ప్రవేశ పెట్టలేని కాంగ్రెస్ కు మళ్లీ ఆయన అనుకూలంగా మాట్లాడటం ప్రారంభింటాడని, ఇందులో ఏదో మతలబు ఉందని ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు.

సోనియా తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఇంత వరకు నోరు ఎందుకు మెదపటం లేదని, బిల్లును ప్రవేశ పెట్టడానికి చొరవ ఎందుకు తీసుకోవటం లేదో కెసిఆర్ సమాధానం చెప్పాలన్నారు. అంతే కాకుండా ఒకసారి సోనియాను తిట్టడం, మరోసారి పొగుడుతున్న కెసిఆర్ కూడు ఎప్పుడైనా బిల్లు ప్రవేశ పెట్టమని అడిగాడా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన చేస్తే మొదట రాజీనామా చేసింది కాంగ్రెస్ ఎంపీనే అని, అయినా ఎవరి ప్రాంతంపై వారికి అభిమానం ఉంటుందని అన్నారు. ప్రజల ప్రాంతీయ ఆభిమానాలను బట్టి ఆయా రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+