అయోధ్య తీర్పుపై మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి

ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని, తమకు న్యాయపరమైన హక్కు ఉన్నందున సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు.సుప్రీం తీర్పునకు కట్టుబడి ఉంటామని చెప్పారు. హైకోర్టు తీర్పులో పేర్కొన్న విధంగా వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయడాన్ని మేం అంగీకరించబోమని, మసీదు ఉనికిపై తమ దగ్గర గట్టిఆధారాలున్నాయని, హైకోర్టుకూ నివేదించామని, కాని న్యాయమూర్తులు వాటిని చూడలేదని అన్నారు. ముగ్గురు జడ్జీల్లో ఇద్దరు అక్కడ బాబ్రీ మసీదు ఉందని స్పష్టంచేశారని. అయినా తీర్పు మాత్రం ఇలా వెలువడటం అసంతృప్తి కలిగించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications