రాహుల్ గాంధీ ఆహ్వానంతో కాంగ్రెసులోకి తమిళ హీరో అజిత్?

కాగా, అజిత్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్నాడియంకె నేతలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అజిత్ ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెసులో చేరడమా, అన్నాడియంకెలో చేరడమా అనే సందిగ్ధంలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. తమిళనాడులో పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్న రాహుల్ అజిత్ రాక ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అజిత్ కు ప్రచాస సారథ్య బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications