రవీంద్రారెడ్డిని సవాల్ చేసిన వైయస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి

డిఎల్ రవీంద్రారెడ్డిది అవినీతి చరిత్ర అని ఆయన అన్నారు. బినామీ పేర్లతో నాసిరకం విత్తనాలు సరఫరా చేసి రవీంద్రా రెడ్డి కోట్లు దండుకున్నారని, షూ కంపెనీ పేరుతో రైతులకు నాసిరకం విత్తనాలు సరఫరా చేసి 15 ఏళ్లుగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుగంగ పనుల్లో రవీంద్రారెడ్డి 65 కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన అన్నారు. నేను అవినీతికి పాల్పడ్డానో, నువ్వు అవినీతికి పాల్పడ్డావో తేల్చడానికి విచారణకు సిద్ధమేనా అని ఆయన రవీంద్రా రెడ్డిని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications