శాసనసభ్యురాలు కొండా సురేఖ కాంగ్రెసు పార్టీలో ఉన్నారా?

తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులకు సిగ్గు లజ్జా ఉంటే చంద్రబాబు ఇంటిముందు ధర్నా చేయాలని సూచించారు. తమ అధినేత్రి ఇంటిముందు ధర్నా చేస్తే ఫలితం లేదని బాబు ఇంటిముందు ధర్నా చేసి తెలంగాణకు అనుకూలంగా తీర్పు శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇప్పించాలని సూచించారు. చంద్రబాబుపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు సరియైనవేనన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వగానే తెలంగాణ రాదని, దానిపై సంపూర్ణమైన సర్వే చేయాల్సి ఉంటుందన్నారు.
కొండా సురేఖపై సీనియర్ కాంగ్రెసు శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా మండిపడ్డారు. కాంగ్రెసు భూస్థాపితమవుతుందనే సురేఖ వ్యాఖ్యలను తప్పు పట్టారు. కాంగ్రెసును ఎవరూ భూస్థాపితం చేయలేరని ఆయన అన్నారు. సురేఖపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వల్లనే సురేఖ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర రాజకీయ యాత్ర కాకూడదని ఆయన అన్నారు. జగన్ యాత్ర వల్ల కాంగ్రెసుకు మేలు జరిగితే మంచిదేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications