అయోధ్య తీర్పులాగే తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక: టిజి వెంకటేష్

తెలంగాణ ఇస్తామని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్తే అందరూ అంగీకరిస్తారని, అయితే సోనియా అటువంటి తప్పు చేయరని ఆయన అన్నారు. సోనియా గాంధీ గొప్ప నాయకురాలని, ఆమె తప్పులు చేయరని టిజి వెంకటేష్ న్నారు. తెలంగాణ ఇస్తామని సోనియా ఎప్పుడు చెప్పారో బయట పెట్టాలని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును అడిగారు. ప్రాంతీయ ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై కేసులు ఎత్తేయడాన్ని తాను సమర్థిస్తానని, అయితే వారి వెనక ఉన్న కుట్రదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం తెలంగాణ నాయకులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బాబ్లీపై ధర్నాకు వెళ్లి తెలుగుదేశం నాయకులు కాళ్లూ చేతులు విరగ్గొట్టుకున్నారని, సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తే తెలుగుదేశం నాయకుల నడుములు విరుగుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications