మళ్లీ మేకపాటిపై ధ్వజమెత్తిన వి హనుమంతరావు

కాంగ్రెసు నాయకులు ప్రతిపక్ష నాయకుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నది ఏ పార్టీనో వారికి తెలుసా అని ప్రశ్నించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో తెలుగు దేశం పార్టీ లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. వారు కాంగ్రెసు ముఖ్యమంత్రి అయిన రోశయ్యనే టార్గెట్ చేసుకున్నారని ఆరోపించారు. తాను వైఎస్ బతికున్నప్పుడు ఏం మాట్లాడలేదనడాన్ని అయన ఖండించారు.
వైఎస్ ఉన్నప్పుడూ తాను ఆయన చర్యలను ఖండించానన్నారు. ఆయన అక్రమాలపై ఆయన ముందే మాట్లాడానన్నారు. తాను ఇప్పుడు, అప్పుడు ఎప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్ ఆయన వర్గీయుల అక్రమాలపై మాట్లాడుతుంటానన్నాడు. సోనియా గాంధీ పెద్ద పెద్దోళ్లను చూశారు. ఇలాంటి చిన్నవాళ్లు ఆమెను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ దమ్మున్న వ్యాఖ్యలు చేశారని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications