విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పిఎస్ లో లాకప్ డెత్?

Vishakapatnam
విశాఖపట్నం‌: విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీసు స్టేషనులో ఓ యువకుడు శుక్రవారం అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులు హింసించడం వల్లనే అతను మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, గుండెపోటుతో మరణించాడని పోలీసులు వాదిస్తున్నారు. ఓ చీటింగ్ కేసులో నక్కా సురేష్ అనే యువకుడిని పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. అతను శుక్రవారం అర్ధరాత్రి మరణించాడు.

పోలీసులు కొట్టడం వల్లనే సురేష్ మరణించాడని ఆరోపిస్తూ అతని బంధువులు శనివారం ఉదయం పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వారికి దళిత సంఘాలు మద్దతిస్తున్నాయి. అయితే, తాము కొట్టడం వల్ల సురేష్ మరణించాడనే విమర్సలను పోలీసులు తోసి పుచ్చుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+