జగన్ ఓదార్పు ఎఫెక్ట్: నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డికి షోకాజ్

పార్టీతో 15 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గోపాల్ రెడ్డి 15వ తేదీ డిసిసి సమావేశానికి ఆహ్వానించామని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, పాల్పడితే చర్యలు తప్పవని ఆ సమావేశంలో చెప్పామని, అయినా వినకుండా గోపాల్ రెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని డిఎస్ తన లేఖలో వివరించారు. డిసిసి అధ్యక్ష పదవి చాలా కీలకమైందని, ఆ హోదాలో ఉంటూ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని డిఎస్ అన్నారు. పార్టీ అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పినప్పటికీ గోపాల్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను పార్టీ అనుమతి లేని కార్యక్రమంగా పరిగణిస్తూ డిఎస్ గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.












Click it and Unblock the Notifications