హైకోర్టు బెంచ్ కోసం ఆందోళనకు దిగుతున్న బెజవాడ లాయర్లు

High Court
విజయవాడ‌: కోస్తాంధ్రలో హైకోర్టు బెంచ్ కోసం విజయవాడ న్యాయవాదులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారు శనివారం ఆందోళనకు దిగారు. హైకోర్టులో తెలంగాణ న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో కోస్తాంధ్ర న్యాయవాదులు హైకోర్టు బెంచ్ ను కోస్తాంధ్రలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు బెంచ్ సాధన కోసం ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) ఏర్పాటైంది. జెఎసి చైర్మన్ గా కర్ణాటి రామ్మోహన్ రావు, కన్వీనర్ గా శామ్యూల్ జాన్, కో కన్వీనర్ గా చలసాని అజయ్ కుమార్ నియమితులయ్యారు.

హైకోర్టు బెంచ్ సాధన కోసం ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కోర్టుల్లో విధులు బహిష్కరించాలని జెఎసి పిలుపునిచ్చింది. కోస్తాంధ్ర, ఉత్తారంధ్ర బార్ అసోసియేషన్లు గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తులకు వినతిపత్రాలు సమర్పిస్తాయి. ఆ తర్వాత ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు జెఎసి నాయకులు చెప్పారు. సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+