ప్రజారాజ్యంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా రీఎంట్రీ

Chiru - Pawan
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో త్వరలో యాక్టివ్ రోల్ పోషిస్తాడని చిరంజీవి మరో తమ్ముడు నాగబాబు విలేకరుల సమావేశంలో తెలిపాడు. పవన్ తన చిత్రాల బిజీలో ఉండి కొంతకాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడని, త్వరలో ఆయన చిత్రాల షెడ్యూలు పూర్తి కాగానే పార్టీలో తన రోల్ పోషిస్తాడని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా ఎదురు చూస్తారో ఇప్పుడు పార్టీలో కూడా ఆయన రోల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని అది త్వరలో నెరవేరనుందని ఆయన చెప్పారు. పవన్ తో పాటుగా తానూ పార్టీ కార్యకలాపాల్లో ఇకనుండి చురుగ్గా పాల్గొంటానని ఆయన చెప్పారు. ఇన్నాళ్లు తాను కూడా బిజీగా ఉన్నానని ఇప్పుడు ఫ్రీ కావటంతో పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటానికి అభిమానులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.

పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడంపై అభిమానుల్లో ఉత్సాహం పొంగుతోందని ఆన్నారు. తామ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూసిన అభిమానులు ఇప్పుడు ఉత్సాహంతో ఉన్నారని, వారు కూడా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారన్నారు. జనంలోకి ఎలా వెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించామని, ఆభిమానులు, పార్టీ కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకొని కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. తాము ఏదో ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటామని, చిరంజీవికి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారని కాబట్టి ఆన్ని ప్రాంతాలను కలుపుకొని పోతామన్నారు.

కాగా పవన్, నాగబాబు రీ ఎంట్రీలో పార్టీకీ పూర్వ వైభవం వస్తుందని ఆభిమానులు ఆశిస్తున్నారు. సినిమాలలో చాలా బిజీగా ఉన్న పవన్ కేవలం అన్నయ్య కోసం సినిమాలను కొద్దికాలం పక్కన పెట్టి రావటంతో పార్టీలోని వారందరి ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది. దీంతో తమ పార్టీ గ్రామగ్రామంలో ప్రజల్లోకి వెళుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+