ఒంగోలు: మహేష్ బాబు హీరోగా వస్తున్న ఖలేజా చిత్రం ఏరియా హక్కులు సొంతం చేసుకున్న బయ్యర్ వెంకటేశ్వరరావు చేతిలో నుండి 10 లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అతను తన డబ్బులు తన బ్రీఫ్ కేసులో పెట్టుకొని వెళుతుండగా ఇది గమనించిన దుండగులు చేతిలోనించి బ్రీఫ్ కేసు లాక్కెళ్లారు. ప్రకాశంలోని సంగం థియేటర్ వద్ద బ్యాంకునుండి ఆ బయ్యర్ డబ్బులు తీసుకొని వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా, ఖలేజా సినిమా టైటిల్ పై హైదరాబాదు కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఖలేజా టైటిల్ తనదేనంటూ నిర్మాత విజయభాస్కర్ రెడ్డి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.