కవిత డిమాండ్ కు తలొగ్గిన ప్రభుత్వం: దసరా సెలవుల పెంపు

తెలంగాణ పండుగ పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, అందుకే బతుకమ్మ పండుగకు సెలవులను తగ్గించిందని కవిత విమర్శిస్తూ వచ్చారు. ఆంధ్ర ఆధిపత్యంలోని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం తలొగ్గిందని విమర్శించారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి సెలవులను పెంచింది. దసరాకు ముందు తెలంగాణలో తొమ్మిది రోజులు, బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఉంటాయి. బతుకమ్మ మొదటి రోజు నుంచి మొదలు పెట్టి తొమ్మిదో రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు, ఆ తర్వాత దసరా పర్వదినం కలుపుకుని గతంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చేది. ఆ సెలపులను కుదించడంపై తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమైంది.












Click it and Unblock the Notifications