మహేష్ బాబు ఖలేజాపై వాదనలు పూర్తి, తీర్పు వాయిదా

ఖలేజా ప్రింట్లు ఇప్పటికే దేశంలోని డిస్ట్రిబ్యూటర్లందరికీ చేరుకున్నాయని, 7వ తేదీన సినిమా విడుదలవుతుందని చిత్రం నిర్మాతలు అంటున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసిందని చెప్పారు. ఈ స్థితిలో సినిమా విడుదలపై ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవద్దని వారు న్యాయమూర్తిని కోరారు. కాగా, తాను జూలైలో ఖలేజా టైటిల్ ను రిజిష్టర్ చేశానని, దానిపై పదేళ్ల వరకు తనకే హక్కులు ఉంటాయని విజయభాస్కర్ రెడ్డి వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications