భేటీ మధ్యలో నాగం ఔట్: చంద్రబాబుతో ముదురుతున్న విభేదాలు?

కాగా, పార్టీ తెలంగాణ నేతల మధ్య అనైక్యతను కూడా చంద్రబాబు పెంచి పోషిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో దేవేందర్ గౌడ్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాగం జనార్దన్ రెడ్డిని ప్రోత్సహించినట్లు సమాచారం. దేవేందర్ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత నాగం జనార్దన్ రెడ్డి హవా పెరిగింది. తెలంగాణ గొంతు పెంచిన ప్రతి తెలంగాణ నాయకుడికి మరో నాయకుడిని చంద్రబాబు అడ్డు వేస్తున్నట్లు చెబుతారు. ప్రస్తుతం చంద్రబాబు నాగం జనార్దన్ రెడ్డిని పక్కన పెట్టి దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే నాగం జనార్దన్ రెడ్డి పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications