చిరు యాత్రను తెలంగాణలో అడ్డుకుంటాం :ఓయూ జేఏసి

కాగా ఉస్మానియా విద్యార్థులు మరో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమ వేడిని ప్రజల్లో మరింతగా పాతుకునేలా చేసేందుకు సైకిల్ యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఈనెల 19వ తేదీ నుంచి శ్రీకారం చుట్టనుంది.తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటు కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులను ఏకం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. యాత్ర 13 రోజుల పాటు సాగుతుందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబరు ఒకటో తేదీని విద్రోహదినంగా పాటిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం ఎదుట బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించినట్టు జేఏసీ నేతలు పిడమర్తి రవి, యాదవ్‌లు తెలిపారు.












Click it and Unblock the Notifications