హైదరాబాద్: హైదరాబాద్ లోని ఓ సిడి పాయింట్ పైన పోలీసులు దాడి చేశారు. కొత్త చిత్రాలను కాపి చేసుకొని అమ్ముతున్నట్లు వార్తలు రావటంతో పోలీసులు దుకాణంపై అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో వారికి కొత్తగా విడుదలైల పవన్ కళ్యాణ్ చిత్రం పులి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటించిన రోబో చిత్రం సిడిలు దొరికాయి. దీంతో పోలీసులు అక్రమ సిడిల అమ్మకాలకు కారకులైన ఇద్దరిని అరెస్టు చేసి దుకాణాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.