టిడిపి అధినేత పై మండిపడ్డ కాంగ్రెసు నేత జీవన్ రెడ్డి

ఎప్పుడు సొంతగా అధికారం చేపట్టలేని చంద్రబాబు 2009లో తెలంగాణకు అనుకూలంగా ఉన్నానని ప్రజలను మభ్యపెట్ట జూపి అధికారంలోని రావాలని చూచినప్పటికీ ప్రజలను ఆయన్ను తిప్పి కొట్టారని విమర్శించారు. 2009లో చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడని, లేకుంటే తెలంగాణకు వ్యతిరేకి ఆయిన ఆయనకు అన్ని సీట్లు వచ్చేవి కావన్నారు.
తెలంగాణకు అనుకూలమంటూ చెప్పుకొస్తున్న చంద్రబాబు డిసెంబర్ 9న కాంగ్రెసు ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానిని చంద్రబాబు నీరుగార్చారని దుయ్యబట్టారు. ప్రతి పార్టీకి ప్రత్యామ్నాయం ఉండాలని, కాంగ్రెసు కు తెలుగు దేశం ప్రత్యామ్నాయంగా ఉండాలంటే తెలంగాణకు అనుకూలంగా చిత్తశుద్ది నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications