20 మంది ఎమ్మెల్యేల రాజీనామా: సంక్షోభంలో యెడ్యూరప్ప ప్రభుత్వం

ఇటీవలి పునర్వ్యస్థీకరణలో తమకు మంత్రి పదవులు రాకపోవడంతో, కనీసం కార్పొరేషన్ పదవులు కూడా దక్కకపోవడంతో రేణుకాచార్య నాయకత్వంలో అసమ్మతి గ్రూపు శాసనసభ్యులు ఏకమయ్యారు. కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు భూయజమానులకు నష్టపరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు నివేదిక సమర్పించడంతో అసమ్మతికి పునాదులు పడ్డాయి. కాగా, తన ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని యెడ్యూరప్ప అంటున్నారు.












Click it and Unblock the Notifications