రాజధానిలో వెలుగు చూసిన మరో డ్రగ్స్ రాకెట్

ఇటీవల సినీహీరోలు రవితేజ తమ్ముళ్లకు డ్రగ్స్ సరఫరా చేసిన చిమా క్లెమంట్ అనేవాడు రాక్సీకి ఏజెంటు. క్లెమెంట్ దగ్గర డ్రగ్స్ రాకెట్ సమాచారం తెలుసుకున్న పోలీసులు రాక్సీని పట్టుకోవడానికి ఇన్నాళ్లు చూశారు. అయితే అతను హైదరాబాద్ లో లేక పోవటంతో వీలుకాలేదు. అయితే మంగళవారం హైదరాబాద్ వచ్చాడని తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
కాగా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా దేశస్తులైన అన్నదమ్ములను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నైజీరియాకి చెందిన వీరు అన్నదమ్ములగా పోలీసులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి కొకైన్ విక్రయాలు మొదలుపెట్టారు. ఆగస్టులో పోలీసులకు పట్టుబడ్డ నైజీరియా దేశస్తుడు ఒకేచుక్వు ఒహాజురికే సమాచారం మేరకు నిఘా ఉంచగా, మంగళవారం దాడిచేసి ఇద్దరినీ అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications