తెలంగాణకు ఒప్పిస్తేనే చిరంజీవి ఫ్యాన్స్ తో మాట్లాడుతా: గద్దర్

తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాజకీయ పార్టీ కాదని, ఓ ఉద్యమం సంస్థ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీలు, సంస్థలు, ప్రజల మధ్య ఓ లెన్స్ లా తమ ఫ్రంట్ పని చేస్తుందని ఆయన చెప్పారు. ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే పలు జిల్లాల నాయకత్వాలతో సమీక్షలు జరిపామని, మరిన్ని జిల్లాల నాయకత్వాలతో సమీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 9వ తేదీన ఫ్రంట్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications