• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాహుల్ గాంధీ ఓ రాజకీయ అజ్ఞాని: బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

By Srinivas
|
Kishan Reddy
హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్సి, సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఓ రాజకీయ అజ్ఞాని అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు కూడా ఆర్ఎస్ఎస్ ను విమర్శించ లేదని ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ ఎస్ ను ఉగ్రవాద సిమితో పోల్చినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ కు దమ్ముంటే ఆర్ఎస్ఎస్ ను బాన్ చేయాలని, ఆప్పుడు దాని సత్తా ఏంటో తెలుస్తుందన్నారు.

రాహుల్ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రాహుల్ కు దేశభక్తులకు, దేశ ద్రోహులకు మధ్య తేడా తెలియక పోవడం విచారకరమని, అలాంటి వ్యక్తికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అర్హత లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X