మారు తండ్రి కిరాతకం: ప్రకాశం జిల్లాలో బాలుడికి సిగరెట్ వాతలు

అయితే స్థానికులు సలీంను బాధిస్తున్న విషయం తెలుసుకొని చలించిపోయారు. వెంటనే ఆ బాలున్ని స్థానిక వైద్యశాలకు తరలించారు. బాలుడికి తీవ్రగాయాలయ్యాయని, అయితే ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లకు, చేతులకు మొత్తం గాయాలున్నాయి. అయితే మానసికంగా మాత్రం బాలుడు చాలా భయంతో ఉన్నాడని, తండ్రిని చూస్తేనే వణికిపోయే పరిస్థితిలో ఉన్నాడని, కాబట్టి బాలుడికి మానసికంగా చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లో మారుతండ్రిపై ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించి ఎస్ఐ భీంనాయక్ బాలుడిని తల్లిని ఇంటరాగేట్ చేశారు. తనకు ఏమీ తెలియదని ఆమె కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసింది. సంవత్సరం నుండి జరుగుతున్నా ఏమీ తెలియదని చెప్పడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులను ఇద్దరినీ శిక్షించాల్సిందేనని వారు ఎస్ఐకు విన్నవించుకున్నారు. అయితే తల్లి ప్రస్తుతం చికిత్స పొందుతున్నబాలుడి దగ్గరే ఉంది. కాగా పరారైన బాలుడి మారుతండ్రి భాషా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తో భాషా ఉంటాడనే అనుమానం ఉన్న ప్రతిచోట వెతుకుతున్నారు.












Click it and Unblock the Notifications