రాహుల్ గాంధీతో యోగా గురు బాబా రామ్ దేవ్ రహస్య భేటీ

నల్లధనం గురించి, మావోయిస్టు సమస్యపై రాహుల్ తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. తాను సోనియా గాంధీతో భేటీ కోసం అడిగానని, గంట పాటు భేటీకి అవకాశం కల్పిస్తానని రాహుల్ తనకు చెప్పినట్లు ఆయన తెలిపారు. నల్లధనం గురించి ప్రధానితో మాట్లాడాలని తనకు రాహుల్ సూచించినట్లు ఆయన చెప్పారు. ప్రధానితో సమావేశానికి కూడా ఏర్పాట్లు చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. రాహుల్ తో భేటీ తర్వాత బాబా రామ్ దేవ్ తన మనసు మార్చుకున్నట్లున్నారు. రాహుల్ గాంధీలో నిజాయితీ కనిపించిందని, చెప్తే వినడానికి సిద్ధంగా ఉంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications