జూబ్లీహిల్స్ లో టైర్ల వ్యాపారి విజయ్ రాఘవన్ పై కాల్పులు
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధాని నగరంలోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్న ఓ టైర్ల వ్యాపారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు హత్యాప్రయత్నం చేశారు. అయితే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఫిలిం నగర్ లోని జర్నలిస్టు కాలనీలోని ఉంటున్న విజయ్ రాఘవన్ గురువారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. ఆయన భార్య, కూతురు పక్క గదిలో నిద్రిస్తున్నారు. ఆయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు ఎవరి జరిపారో తమకు తెలియదని, తమకు ఎవరూ శత్రువులు లేరని కుటుంబ సభ్యులు అంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.విజయ రాఘవన్ నగరంలోని సిద్ది అంబర్ బజార్ లో టైర్ల వ్యాపారం చేస్తున్నాడు.