వార్డెన్లకు ఉపసంచాలకుడి లైంగిక వేధింపులు: విద్యార్థిని పంపాలనీ వేధింపు

ఉపసంచాలకుడు రామకృష్ణ తమను నెలకు 20 వేల రూపాయలకు పైగా ఇవ్వాల్సిందిగా అడుగుతుంటాడని, లేదంటే నిరంతరం ఫోన్ లు చేసి వేధిస్తుంటాడన్నారు. ఆ బాధను భరించలేక తాము తప్పు అయినప్పటికీ ఆయనకు డబ్బులు పంపిస్తుంటామని వాపోయారు. అయితే తమను అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఫోన్ లు చేసి ఢబ్బులు ఇచ్చి వెళ్లమని, తన ఇంటికి రమ్మని వేధిస్తుంటాడన్నారు.
ఆయన వేధింపులు భరించలేక అయనకు డబ్బులు ఇవ్వడానికి మేం అప్పులు చేయవలసి వస్తుందని, తమ జీతాలు మొత్తం ఆయనకే పెట్టవలసి వస్తుందంటున్నారు. తమను మాత్రమే కాకుండా హాస్టల్ లో ఉంటున్న 10వ తరగతి విద్యార్థులను కూడా తన దగ్గరకు పంపాలని అడుగుతుంటాడని ఆరోపించారు.అయన చెప్పినట్టు చేయకుంటే మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
విశాఖ జిల్లాలో 86 సాంఘీక సంక్షేమ హాస్టళ్లు ఉండగా అందులో 25 విద్యార్థునుల(లేడీస్) హాస్టల్ ఉన్నాయి. అన్ని హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికి 10 రూపాయల చొప్పుల ఒక హాస్టళ్లో 100 మంది ఉంటే 1000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తాడని వారు అంటున్నారు. డబ్బులతో పాటు, వార్డెన్లను లైంగిక వేధింపులకు గురిచేయటం, విద్యార్థినులను ఇంటికి పంపాలని కీచకునిలా ప్రవర్తిస్తున్న రామకృష్ణపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా వారు కలెక్టర్ ను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications