కెసిఆర్ ను పరోక్షంగా తప్పు పట్టిన ప్రజా ఫ్రంట్ నేత గద్దర్

తెలంగాణ సాధనకు ఉద్యమమే మార్గమని, మరో మార్గం లేదని అయన స్పష్టం చేశారు. ఇతర రాజకీయ పార్టీలతో వైరం, ఘర్షణలు లేకుండా తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆత్మ గౌరవం, సమన్యాయం, స్వయంపాలనే తమ నినాదమనిగద్దర్ తెలిపారు. తాను ఉద్యమాల నుంచి వచ్చిన ఒక సాధారణ కార్యకర్తనని, రాజకీయ వేత్తను కాదని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌పార్టీ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉందని, అన్ని రాజకీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ ఇప్పించలేకపోయాయని ఆయన ధ్వజమెత్తారు. గద్దర్ నేతృత్వాన 'తెలంగాణ ప్రజా ఫ్రంట్' శనివారం లక్డీకాఫూల్‌లోని మారుతీ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రాజకీయ పార్టీలు, స్వార్థ రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ శక్తులన్నీ ఏకం చేసి, గ్రామ స్థాయినుంచి ఫ్రంట్‌ను నిర్మించి, లక్ష్యం సాధిస్తామని గద్దర్ పేర్కొన్నారు. తెలంగాణ వనరులను కాపాడుకోడానికి ఉద్యమస్తామని, తెలంగాణ పోరాటానికి కొత్త రూపు తెస్తామని తెలిపారు.
డిసెంబర్‌లో జరగనున్న శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టేలా రాజ్యాంగ బద్దంగా ఉద్యమిస్తామని గద్దర్ చెప్పారు. ఈ విషయంలో భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. నిర్మాణాత్మక, విధానపరమైన విమర్శనే కొనసాగించాలని, వనరుల సంరక్షణ, విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, తెలంగాణను అంగడి సరుకుగా చేస్తున్న విధానాలను పల్లె పల్లెకు వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు గద్దర్ చెప్పారు.












Click it and Unblock the Notifications