తెలంగాణ ఇవ్వకపోతే మానవ బాంబులు అవుతాం: కె చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
ఆదిలాబాద్: తెలంగాణ ఇవ్వకుంటే మానవ బాంబులుగా మారి గుణపాఠం నేర్పుతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లు, టీడీపీ, కాంగ్రెసు ల ద్వంద్వ విధానాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే మానవ బాంబులుగా మారుతామని, గుణపాఠం నేర్పుతామని ఆయన చెప్పారు. భైంసాలో శుక్రవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడకపోతే తెలంగాణ ప్రాంతంలో భూకంపం తప్పదన్నారు. తెలంగాణ రథ చక్రాల కింద ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకులంతా నలిగిపోతారని హెచ్చరించారు. సహాయ నిరాకరణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటామన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెసు, టీడీపీలు మోసపూరిత విధానాలు అవలంబిస్తూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాన్చుడు ధోరణి, తెలంగాణ ఉద్యమాలను అణచి వేసే వైఖరులను ప్రదర్శిస్తున్నాయన్నారు. డిసెంబర్ నెలలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక వ్యతిరేకంగా వచ్చినా, తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎలాంటి జాప్యం తలెత్తినా తెలంగాణ వాదులంతా మానవ బాంబులవుతారని హెచ్చరించారు.

తెలంగాణ వాదులంతా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుకుంటుంటే యూపీఏ సర్కార్ ఆంధ్ర పాలక నేతలకు తలొగ్గి నాన్చుడు ధోరణి అవలంబించడం సరైంది కాదని చెప్పారు. ఒకరిద్దరు నేతల ఒత్తిళ్లతో యూపీఏ సర్కార్ నిర్ణయంలో వెనుకడుగు వేసిందన్నారు. లగడపాటి జగడపాటి చూపిన డబ్బు ఎర తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముందు పనికి రాదన్న విషయం త్వరలోనే తేలనుందని చెప్పారు. యూపీఏ సర్కార్ ఇక బుజ్జగింపు ధోరణి, అణచివేసే వైఖరి అవలంబించకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీ, నియమాలు లేని ఆంధ్ర పాలకులు ఇప్పటికైనా తమ దోపిడీ విధానాలకు స్వస్తి పలకాలని సూచించారు. తెలంగాణలోని కాంగ్రెసు, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలను దద్దమ్మలు, సన్నాసులు, చాతగాని వారిగా ఆయన అభివర్ణించారు. వీరి వ్యవహార శైలి మూలంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతున్నదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+