రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలో పేరు మారింది

రామ్ గోపాల్ వర్మ తన రక్త చరిత్రను పరిటాల రవీంద్ర భార్య పరిటాల సునీతకు చూపించిన తర్వాతనే చిత్రాన్ని విడుదల చెయ్యాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పలు సమస్యలు వెల్లువెత్తకుండా ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఉంది. ఆయన చేసే ప్రతి చిత్రం వివాదాల్లో ఇరుక్కు పోవటం తెలిసిందే.
ఇటీవల విజయవాడకు చెందిన రాజకీయ నాయకుడు పండు హత్య తరువాత కూడా రామ్ గోపాల్ వర్మ బెజవాడ రౌడీలు అనే చిత్రాన్ని తీస్తానని ప్రకటించారు. ఆ ప్రకటన తరువాత విజయవాడకు చెందిన పలు రాజకీయ పార్టీల నేతలు ఆయన తీరును విమర్శించారు. రామ్ గోపాల్ వర్మ సంచలనాల కోసం వివాదాలను తన చుట్టూ తిప్పుకుంటాడని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications